కోనసీమ: హైదరాబాద్లోని కన్హా శాంతి వనంలో నిర్వహించిన అంతర్జాతీయ హోమియో సదస్సులో అమలాపురం వైద్యులు డా. బి.ఎస్. మోహన్, డా. విస్సా దయానిధి పరిశోధనా పత్రాలు సమర్పించి ప్రత్యేక గుర్తింపు పొందారు. సదస్సులో 1,400 మందికి పైగా వైద్యులు, పరిశోధకులు పాల్గొని హోమియోపతిలో ఆధునిక పరిశోధనలపై చర్చించారు.
వార్తలు
అంతర్జాతీయ సదస్సులో జిల్లా వైద్యులకు గుర్తింపు


