హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం

BDK: రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైంది. ఈ పథకం కింద తొలి కేసుగా స్వరాజ్యం అనే బాధితురాలికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రూ.22 వేల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందని తెలిపారు.