BDK: మారుమూల ఏజెన్సీ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లిలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన, గిరిజనేతర పేదల రవాణా కష్టాలు తీర్చేందుకు గిరిజన గూడేలు, తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే కూనంనేని


