హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం

ASF: కౌటాల మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిర్పూర్ టీ గురుకుల పాఠశాల పునర్నిర్మాణానికి సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్లను వివిధ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాగజ్‌నగర్‌లోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.