హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా మత్స్యగిరి నరసింహ స్వామి పల్లకి సేవ

BHNG: వలిగొండ మండలంలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ వైభవంగా సాగింది. పూలతో సుందరంగా అలంకరించిన పల్లకిలో స్వామివారిని ఊరేగించగా, సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేశఖండన శాల పరిసరాల మీదుగా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.