JGL: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం గొల్లపల్లి మండలంలో కొత్త పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. అర్హత ఉండి పెన్షన్ రానివారు ఆందోళన చెందవద్దని, నిబంధనల ప్రకారం అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. మండలంలో కొత్తగా 735 మందికి పెన్షన్లు మంజూరు అయిందన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందిస్తాం: మంత్రి


