హైదరాబాద్: 28°C
తెలంగాణ

హేమాచల ఆలయానికి భక్తుల కానుకలు

MLG: మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు కానుకలు సమర్పించారు. మంగపేటకు చెందిన పెనుమత్స కృష్ణమూర్తిరాజు, రమాదేవి దంపతులు రూ.90 వేల విలువైన ఇత్తడి హుండీని అందించారు. మల్లూరుకు చెందిన గోళ్లమూడి చంద్రశేఖర్, హరీష దంపతులు రూ.10 వేల విలువైన వెండి కాగడాలను బహుకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీకరించారు.