హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకరేసి రెండేళ్లైనా పనులు పూర్తి కాలే!

MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామం నుంచి కుక్కడం వెళ్లే రహదారి పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. బీటీ రోడ్డు కోసం రెండేళ్ల క్రితమే కంకర పరిచినా ఇప్పటివరకు తారు వేయలేదు. దీంతో రహదారి అధ్వానంగా మారి వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.