హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా TGSRTC యూనియన్ విజయోత్సవ ర్యాలీ

ఖమ్మం నగరంలో మంగళవారం TGSRTC ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి డిపో రోడ్డు వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.