హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ సిబ్బందిపై ఎస్సై దురుసు ప్రవర్తన

విజయనగరంలో మున్సిపల్ అధికారులపై వన్‌టౌన్ పోలీసుల దురుసు ప్రవర్తన కలకలం రేపింది. మున్సిపల్ మార్కెట్ సమీపంలో అనుమతులు లేకుండా హెల్ప్ డెస్క్ నిర్మాణం చేపట్టగా టౌన్ ప్లానింగ్ అధికారి అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో SI ప్రసన్న కుమార్ ఇద్దరు మున్సిపల్ సిబ్బంది కాలర్లు పట్టుకుని లాక్కెళ్లారు. ఘటనపై కమిషనర్ బాలస్వామి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.