KRNL: సి.బెళగల్(M) పోలకల్ గ్రామంలోని ఈశ్వరాలయంలో నంది విగ్రహం అపహరణకు గురైంది. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేసేందుకు తెరిచిన నిర్వాహకుడు విగ్రహం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ సమీప ఆలయంలో గంటలు చోరీ కావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలకల్ ఈశ్వరాలయంలో నంది విగ్రహం చోరీ


