హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడు మృతి..విషాదంలో కుటుంబం

వనపర్తి: పానగల్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన రోహిత్ సాగర్ (18) హైదరాబాద్‌లో మృతి చెందాడు. నెల రోజుల క్రితం గాలివాన సమయంలో చెట్టు కింద నిలుచుండగా చెట్టు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.