హైదరాబాద్: 28°C
తెలంగాణ

కందగిరి స్వామిని దర్శించుకున్న MLA

MHBD: కురవి మండలం కందికొండ గ్రామ శివారులోని శ్రీ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.