MDCL: అల్వాల్ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 69వ రోజుకు చేరాయి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా కల్పించాలని నాయకులు కోరారు. 69వ రోజు దీక్షలో బి. పరమేశ్వర్ కూర్చోగా, పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, శోభన్ బాబు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
69వ రోజుకు చేరిన ఉద్యమకారుల దీక్షలు


