హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారమ్మ తల్లి మహోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే

VZM: డెంకాడ మండలం మోదవలసలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి మహోత్సవాలకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.