SRPT: హైవే సర్వీస్ రోడ్డుపై రైతులు ధాన్యం ఆరబెట్టవద్దని మోతె ఎస్ఐ బి.లచ్చిరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలకు కారణమైతే సంబంధిత రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు రహదారి భద్రతకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
సర్వీస్ రోడ్డుపై ధాన్యం ఆరబెడితే చర్యలు: ఎస్ఐ


