ASR: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. పలు చోట్ల గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు రోజులపాటు వర్షాలు


