MLG: ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని జర్మనీ దేశస్తులు మంగళవారం సందర్శించారు. కాకతీయుల చరిత్ర, ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు, అద్భుత శిల్పకళ గురించి టూరిజం గైడ్ వివరించగా ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ శిల్ప సంపదను వారి కెమెరాలలో చిత్రీకరించారు.
తెలంగాణ
రామప్పను దర్శించిన జర్మనీ పర్యాటకులు


