హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

VSP: సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఓ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనరల్ హెల్త్ చెకప్, ఈసీజీ, వాసన్ ఐ కేర్ ద్వారా కంటి పరీక్షలు, స్మైల్ కేర్ ద్వారా దంత పరీక్షలు, మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టారు. సుమారు రూ.15 వేల విలువైన పరీక్షలను ఉచితంగా అందించామని ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.