హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమరోలు సర్పంచ్‌గా షేక్ ఖాజా వలి ఏకగ్రీవ ఎన్నిక

ప్రకాశం: కొమరోలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా షేక్ ఖాజా వలి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఆయనకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్ ఫారం) అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరోలు సొసైటీ అధ్యక్షుడు ముత్తుముల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఖాజా వలి ఏకగ్రీవ ఎన్నిక పట్ల గ్రామంలోని పలువురు నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.