SRD: జహీరాబాద్ బైపాస్ రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్గోల్ చౌరస్తాలో ఆగి ఉన్న ఓ కోళ్ల వ్యాన్ను వెనకనుంచి కారు ఢీకొన్న ఘటనలో మహారాష్ట్రకు చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం


