హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

MHBD: బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలపై SP శబరీష్ ఆదేశాలతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అనుమతులు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో బయ్యారం సీఐ రవీందర్, ఎస్సైలు ప్రశాంత్ బాబు, సాయికుమార్, సబ్బంది పాల్గొన్నారు.