హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైన ట్రిపుల్ ఐటీ విద్యార్థి

NRML: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్ (19) గోదావరి హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో తొలుత రూ.10 వేలు పెట్టి రూ.30 వేలు గెలిచిన సంపత్, ఆశతో మళ్లీ డబ్బులు పెట్టి నష్టపోయినట్లు సమాచారం. అప్పులు పెరగడం, నష్టాలు రావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.