హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25 నుంచి బాండ్ల ధృవీకరణ ప్రక్రియ: అ. ఎస్పీ

GDWL: ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సీఐడీ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి ప్రత్యేక కేంద్రాల్లో బాండ్ల ధృవీకరణ ప్రారంభమవుతుందని అదనపు ఎస్పీ కె.శంకర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా బాధితులకు మహబూబ్‌నగర్ డీపీవో ఎదురుగా ఉన్న సీఐడీ భవనంలో, జోగులాంబ గద్వాల జిల్లా వారికి 10-05-2027 నుంచి 15-06-2027 వరకు మండలాల వారీగా పరిశీలన జరుగుతుందన్నారు.