సూర్యాపేట జిల్లాలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీలో కొందరు కౌన్సిలర్లు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేటలో 2,098 మందికి, కోదాడలో 889 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పింఛన్ మంజూరుకు డబ్బుల వసూళ్లు!


