హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల హక్కుల కోసం ఈ నెల 26న నిరసన

HNK: రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న హనుమకొండ కాళోజి సెంటర్‌లో చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు గొడుగు వెంకట్, ఎన్.రెడ్డి హంసరెడ్డి కోరారు. మంగళవార నగరంలో ఆయన మాట్లాడుతూ..పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. రుణమాఫీ అమలు చేయాలని, రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.