హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: మేయర్

కృష్ణా: ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని మచిలీపట్నం నగర మేయర్ షేక్ అబ్దుల్ అబీదా హెచ్చరించారు. మంగళవారం ఆమె డిప్యూటీ మేయర్ కొట్టె వెంకట్రావ్, కమిషనర్ బాపిరాజుతో కలిసి మున్సిపల్ హెల్త్ సెక్షన్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ తదితర అంశాలపై సమీక్షించారు.