SRCL: పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే


