KDP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి ప్రధాన అర్చకులు కల్యాణం జరిపించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం


