హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి'

NGKL: జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకంతో పాటు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరుతూ అచ్చంపేట జర్నలిస్టు సురేందర్ మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ప్రకటనల ఆదాయంలో 10 శాతం నిధులను జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.