హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావిర్యాల ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సందడి

RR: కార్తీక పౌర్ణమి సందర్భంగా రావిర్యాలలోని ప్రసిద్ధ శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో భక్తిభావం వెల్లివిరిసింది. పండుగ వాతావరణం నెలకొంది.