ఉమ్మడి జిల్లాలోని ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
తెలంగాణ
కేతకి సంగమేశ్వరుడి పోటెత్తిన భక్తులు


