SRD: రాయికోడ్ మండలం కర్చల్ గ్రామంలో మంచి నీరు వృథాగా పోతున్నాయి. ఓవైపు నీటి కొరతపై అవగాహన కల్పిస్తున్నా వృథాను అరికట్టే చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టడంతో పాటు గ్రామాల్లో పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


