WGL: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధ్రువీకరణకు వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నర్సంపేట ACP రవీందర్‌రెడ్డి తెలిపారు. చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో పరిశీలన చేపడతామన్నారు. బాధితులు బాండ్లు, ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీల్లో హాజరుకావాలని కోరారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
తెలంగాణ
అగ్రిగోల్డ్ బాధితులు నిర్ణీత తేదీల్లో హాజరుకావాలి: ACP


