హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంబగిరిని పరామర్శించిన కాటసాని రామిరెడ్డి

NDL: టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన కంబగిరిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. సంజామల మండలం పెరుసోముల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు భాగ్యలక్ష్మిని దూషించడంపై ప్రశ్నించిన కంబగిరిపై దాడి జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కాటసాని హామీ ఇచ్చారు.