హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేయాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: ఓడిసి మండలం గౌనిపల్లిలో స్థానిక నాయకులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సమావేశమయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమష్టి కృషితో గ్రామాల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.