హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవునిపల్లిలో వైభవంగా శ్రీ లక్ష్మి నృసింహస్వామి కళ్యాణం

PDPL: పెద్దపల్లి మండలం దేవునిపల్లిలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మి నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.