హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన కలెక్టర్‌కు సన్మానం

ADB: బేల ప్రభుత్వ గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు వైఫై, కుర్చీలు, పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ డైరెక్టర్ రూపేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ సదుపాయాలను కల్పించారు. ఇందుకు కృతజ్ఞతగా మంగళవారం కలెక్టర్‌ను రెడ్ క్రాస్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.