హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP అభ్యర్థిని ఓటు అడిగిన YCP అభ్యర్థి

WG: పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళవారం 35వ వార్డులో YCP అభ్యర్థి కెల్లా దుర్గా భవాని ప్రచారం చేస్తూ.. అదే వార్డు TDP అభ్యర్థి బాలి పద్మావతి ఇంటికి వెళ్లారు. YCPకి ఓటేసి తనను గెలిపించాలని ఆమెను కోరారు. ఇద్దరు అభ్యర్థులు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.