KNR: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిక్కు బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ ఒక మతానికే పరిమితమైన గురువు కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకుడని కొనియాడారు. కష్టపడి పనిచేయడం, భగవంతుడిని స్మరించడం, సంపాదనను ఇతరులతో పంచుకోవడం అనే ఆయన మూడు గొప్ప సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
తెలంగాణ
యావత్ మానవాళికి మార్గదర్శి గురునానక్: బండి సంజయ్


