హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు న్యాయమూర్తులకు ఘనస్వాగతం

MDK: తూప్రాన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలపతి రావు, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, అ. ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు.