హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి పనులకు శ్రీకారం

NRPT: కృష్ణ మండలం అయీనాపూర్ నుంచి సుగూర్ లింగంపల్లి వరకు రూ.4 కోట్లతో 4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ గౌడ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.