హైదరాబాద్: 28°C
తెలంగాణ

260 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

KMR: మద్నూర్ మండలం సలాబత్పూర్లోని శ్రీ మారుతి మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 260 జంటలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.