హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ణాటక మంత్రితో తెలంగాణ చీఫ్ విప్ భేటీ

VKB: కర్ణాటకలోని కలబురిగి జిల్లా ఘుస్సాపూర్ పర్యటనలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు గతంలో మంత్రులుగా ఉన్న సమయంలో సేడం, తాండూరు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రవాణా, రహదారులు, కాగ్నా నది జలాల వినియోగం, రైతుల సంక్షేమంపై చర్చించారు.