హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్ల కొమ్మలతో కనిపించని రహదారి సూచికలు

GDWL: అలంపూర్‌లోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సూచికలు చెట్ల కొమ్మల మధ్య కనిపించకుండా పోతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా పెరగడంతో కొమ్మలు సూచికలను కమ్మేశాయి. దీంతో వాహనదారులు రహదారి సూచనలు గుర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సూచికలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.