GDWL: అలంపూర్ పట్టణంలోని వీవర్స్ కాలనీ సమీపంలో విద్యుత్ స్తంభం ఒకవైపుకు ప్రమాదకరంగా ఒరిగింది. ఈ మార్గంలో పొలాలకు వెళ్లే రైతులు అధికంగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈదురుగాలులకు స్తంభం నేలకొరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా ఒరిగిన విద్యుత్ స్తంభం


