హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్

ASF సిర్పూర్ (యు) మండలం కోహినూర్ (బి) గ్రామంలో MP నిధులతో చేపట్టనున్న సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సిడం విజయలక్ష్మి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి ఈ డ్రెయిన్ నిర్మాణం దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించిన MPకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.