హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్లూరి అయ్యప్ప ఆలయంలో మాలధారణ కార్యక్రమం

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం బెల్లూరిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అయ్యప్ప మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది భక్తులు గురుస్వాముల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప దీక్షను స్వీకరించారు. స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.