హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. రైతులకు సరిపడా సాగునీరు విడుదల చేయాలని, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రిని కోరారు.