హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

SRD: జిన్నారంలోని జీవన జ్యోతిర్లింగ శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.